Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కన్న బిడ్డలను మూడో అంతస్థులో ఉన్న కిటికిలోంచి పడేసిన తల్లి.. వీడియో వైరల్‌ - Vandebharath

  ఓ బిల్డింగ్‌లోని మూడో అంతస్థులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దట్టంగా పొగ అలుముకుంది. బయటకు వెళ్లే దారి లేదు. అగ్న...


 

ఓ బిల్డింగ్‌లోని మూడో అంతస్థులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దట్టంగా పొగ అలుముకుంది. బయటకు వెళ్లే దారి లేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన వారు రావడానికి సమయం పట్టేలా ఉంది. దీంతో ఆ తల్లి హృదయం తల్లడిలింది. పిల్లలను ఎలాగైనా రక్షించుకోవాలని ఆరాటపడింది. వెంటనే కిటికి ఓపెన్ చేసి సాయం చేయాలని కోరింది. ఆమె తన నలుగురు పిల్లల్ని.. ఒకరి తరువాత మరొకరి కిటికిలోంచి కిందకు విసిరేసింది ఈ ఘటన టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో చోటుచేసుకుంది.


ఇస్తాంబుల్‌లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్థులో మంటలు వ్యాపించాయి. ఆ అంతస్తులో ఓ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. బయటకు రావడానికి ప్రయత్నించగా.. మంటల ధాటికి వీలుపడలేదు. ఇంట్లో దట్టంగా పొగ అలుముకుంటోంది.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. తన పిల్లలను ఎలాగైనా రక్షించుకోవాలని ఆ తల్లి మనసు తల్లడిలింది. వెంటనే రోడ్డు వైపు ఉన్న కిటీకి తెరిచి.. ఆ మార్గంలో వెలుతున్న వారిని సాయం చేయాలని కోరింది.

వారు వెంటనే బ్లాంకెట్లు పట్టుకుని రెడీ ఉన్నారు. వెంటనే ఆ మహిళ... తన పిల్లలను ఒకరి తరువాత ఒకరి కిటీకి నుంచి కిందకు విసిరి వేసింది. కింద ఉన్నవారు ఆ పిల్లలను పట్టుకున్నారు.

ఈ ప్రమాదం నుంచి ఆ తల్లితో పాటు పిల్లలు కూడా క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తల్లి చేసిన సాహాసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.