Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

వనస్థలిపురంలో ఇలాంటి చోరీ ఎవరూ ఊహించరు! Vandebharath

  Vanasthalipuram: మహిళ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంఘటన...


 Vanasthalipuram: మహిళ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.



హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగల బెడద ఎక్కువగా అయిపోయింది. దుండగులు ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళలను, తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి శనివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం ఓ వ్యక్తి ఇంటి అద్దె కోసం వచ్చి ఉమాదేవి అనే మహిళపై దాడి చేశాడు.
 పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్‌లో ఓ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో అద్దెకు గదులు ఉన్నాయా అంటూ ఓ వ్యక్తి శనివారం ఉదయం వచ్చి అడిగాడు. మళ్ళీ అదే వ్యక్తి మధ్యాహ్నం వచ్చి దొంగతనం చేశాడు. ఉదయం రెక్కీ చేయడానికి కిరాయి దారుడిగా వచ్చి మహిళ ఒంటరిగా ఉంటుందని ఆ వ్యక్తి గమనించాడు. మళ్లీ ఇతనే మధ్యాహ్న సమయంలో మళ్ళీ వచ్చి ఇంట్లో ఉన్న ఒంటరి మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

మహిళ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చెసుకోని దర్యాప్తు చెస్తున్నారు.