మధిర: ఖమ్మం జిల్లా మధిర పోస్టాఫీసులో పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న బిజ్జాల శేషు తెలంగాణ రాష్ట్ర బెస్ట్ పోస్ట్‌మ్యాన్ అవార్డుక...
మధిర: ఖమ్మం జిల్లా మధిర పోస్టాఫీసులో పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న బిజ్జాల శేషు తెలంగాణ రాష్ట్ర బెస్ట్ పోస్ట్‌మ్యాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు భారతీయ తంతి తపాలాశాఖ ఉత్తమ అవార్డులను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా 2019–20 ఏడాదికి సంబంధించి ఎక్కువ ఉత్తరాలు అందజేయడం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ. 2.65 కోట్లు చేయించడం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో సేవలందించారు. కాగా, 2018 నుంచి 1,400 ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతాలను ఖాతాదారులతో తెరిపించినందుకు శేషుకు అవార్డు లభించింది.
అలాగే సుకన్య సమృద్ధి ఖాతాలు తదితర ఉత్తమ సేవలకుగాను ఆయన రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 16న తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ చేతులమీదుగా శేషు అవార్డును అందుకోనున్నారు.