Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

వైకాపా శ్రేణుల రాళ్లదాడి- Vandebharath

  గుంటూరు: పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో అగ్గి రాజేస్తు్న్నాయి. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ములకలూరులో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. రాత్రి ఎన్... గుంటూరు: పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో అగ్గి రాజేస్తు్న్నాయి. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ములకలూరులో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. రాత్రి ఎన్నికల ఫలితాలు ముగియగా.. ఆదివారం ఉదయం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. వైకాపా వర్గీయుల రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డామని తెలుగు దేశం నేతలు తెలిపారు. రాళ్లదాడిలో గాయపడిన 8 మందిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపోటములపై విశ్లేషించుకుంటున్న సమయంలో ఇరువర్గాలకు మాటామాటా పెరిగి ఘర్షణ జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.