Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

సాయి స్మరణలో ముస్లిం భక్తులు.. Vandebharath

  సాయిబాబాకు చందనం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు ముస్లిం భక్తులు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో హిందూ ముస్లి...

 


సాయిబాబాకు చందనం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు ముస్లిం భక్తులు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో హిందూ ముస్లింలు కలిసి కట్టుగా ఉంటామని మరోమారు నిరూపించుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గత 24 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 14న జాతరను పురస్కరించుకుని.. మేము సైతం అన్నట్టు హిందువులతో ముస్లిం భక్తులు ప్రతి ఏటా కలిసిమెలిసి జాతరను నిర్వహిస్తారు.గా ప్రతి సంవత్సరంలాగే.. ఈ సారి కూడా సన్నాయి వాయిద్యాలతో సాయిబాబాకు చందనం, పూలు, పండ్లు, స్వీట్లు తెచ్చి పూజారులతో ప్రత్యేక పూజలు చేయించారు. పూజానంతరం..అందరూ కలిసి బాబా ప్రసాదాన్ని స్వీకరించారు.

‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌హై’ అన్న బాబా మాటల ప్రకారం మేమంతా ఒక్కటిగా కలిసి మెలిసి ఉంటామని ఈ ముస్లిం భక్తులు చెబుతున్నారు. అనంతరం ఆలయ పూజారులు వారికి శాలువాలు కప్పి సన్మానం చేశారు.