అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఇప్పుడు బిజెపి నేతలు అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. విరాళాల సేకరణ కోసం కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. ఈ నేపధ...
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఇప్పుడు బిజెపి నేతలు అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. విరాళాల సేకరణ కోసం కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు విరాళాల సేకరణ కోసం తీవ్రంగా కష్టపడుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. బృందావన్ కాలనీలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో శోభా యాత్ర నిర్వహించారు. రామ మందిర నిర్మాణం కోసం నిధి సమీకరణ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ సహా ఇంచార్జ్ సునీల్ ధియోదర్ పాల్గొన్నారు.
దేశంలో ఉన్న ప్రజలందరూ రామాలయ నిర్మాణానికి కదిలి వస్తున్నారు అని ఆయన అన్నారు.కులాలకు, మతాలకు అతీతంగా ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు అని ఆయన తెలిపారు. మోడీ నేతృత్వంలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది అని ఆయన అన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయెలా ఆలయ నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు. అన్ని పార్టీలు ఆలయ నిర్మాణం పట్ల సంతృప్తిగా ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఆలయ నిర్మాణం కోసం నిధులు సమికరిస్తున్నారు అని అన్నారు.
ఎన్నో ఏళ్ల నాటి ఆలయ నిర్మాణం కలను మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సాకారం చేస్తుంది అని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ... చరిత్రలోనే మొదటి మహా ఆలయం నిర్మాణం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు అని తెలిపారు. దేశం చరిత్రలో ఇదొక ఆలయ నిర్మాణం సువర్ణాధ్యాయం అని అన్నారు. ప్రతీ పౌరుడు ఆలయం కోసం కదిలి వస్తున్నారు అన్నారు. రామ మందిరంలో పాలు పంచుకొడానికి అందరూ ముందుకు రావాలి అని కోరారు. ఆలయం నిర్మాణంలో దేశాన్ని ఐక్యం చేసేలా ప్రధాని అడుగులు వేస్తున్నారు అని తెలిపారు.