Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు - Vandebharath

  Jio vs Airtel vs Vi-Best Prepaid Packs Under Rs. 300 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా పోటీపోటీగా ...

 



Jio vs Airtel vs Vi-Best Prepaid Packs Under Rs. 300 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా పోటీపోటీగా ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లను తీసుకొస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. అగ్రగామిగా ఉన్న జియో ధీటుగా ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కూడా ఏమాత్రం తగ్గేది లేదంటూ వరుస ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నాయి.

మూడు టెలికం దిగ్గజాలు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.300 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ముందుగా రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.249 ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది.

28 రోజుల వ్యాలిడిటీపై 56GB డేటాను రోజుకు 2GBడేటా చొప్పున అందిస్తోంది. హైస్పీడ్ బ్రౌజింగ్, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, కాంప్లమెంటరీ సబ్ క్రిప్షన్ కింద జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ : రూ.219 ప్లాన్
రూ.300 లోపు అందించే ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.219 ప్రీపెయిడ్ ప్యాక్ ఒకటి. ఈ ప్లాన్ కింద అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1GB డేటా పొందొచ్చు. అది
కూడా 28రోజుల వ్యాలిడిటీపైనే. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల వరకు ట్రయల్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ మెంబర్ షిప్, ఫ్రీ హాలో ట్యూన్స్, ఫ్రీ వైంక్ మ్యూజిక్ సబ్ స్ర్కిప్షన్ యాక్సస్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా : రూ.218 ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా (Vi) కూడా తమ యూజర్ల కోసం రూ.218 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద అన్ లిమిటెడ్ కాలింగ్, మొత్తం 6GB డేటా పొందవచ్చు. రోజుకు 100SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. Vi ప్రీపెయిడ్ ప్లాన్ కింద విఐ మూవీలు, టీవీ బేసిక్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.