Andhra Pradesh Panchayat Election 2021కు పోలింగ్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎస్ఈసీ.. రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచ...
Andhra Pradesh Panchayat Election 2021కు పోలింగ్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎస్ఈసీ.. రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30కు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 3.30 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.. ఉదయాన్ని ఓటర్లు పోలింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. పోలింగ్ సిబ్బంది కరోనా నిబంధనలు పాటిస్తున్నారు.
*శ్రీకాకుళం జిల్లా: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడ సొంత ఊరు నిమ్మాడలో పోలింగ్. 4 దశాబ్దాల నిమ్మాడ చరిత్రలో తొలిసారి ఎన్నికలు.
*చిత్తూరు జిల్లా: రామచంద్రాపురం మండలం కమ్మ కండ్రిగలో నిరసన. ఓటర్ స్లిప్‌పై ఎన్నికల గుర్తు రాసి పంపుతున్నారని ఆరోపణ. ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.

*విశాఖ జిల్లా: సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు
*నెల్లూరు జిల్లా: వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు.. పోలింగ్ ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం తెలిపారు.
*నెల్లూరు జిల్లా: వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు.. పోలింగ్ ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం తెలిపారు.
*కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. ప్రత్యేక పోలీస్ ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు క్యూ కట్టారు.
ఇక కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు.. ఏజెన్సీ ప్రాంతాల్లో 12.30 నుంచి 1.30 గంటల వరకు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ ఓటర్లను థర్మల్ స్కానింగ్ చేసి సాధారణం కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వారిని వెనక్కి పంపి చివరి గంటలో అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్‌తో పాటూ ఇతర రక్షణాపరమైన ఏర్పాట్లు చేశారు. కరోనా సోకిన వారు ఓటింగ్‌కి ఎక్కువ మంది వస్తే ఆ కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చుతారు. మరోవైపు ఓట్ల లెక్కింపునకు సంబంధించి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను తెలుసుకోవడానికి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఓటర్లందరూ తమ హక్కు వాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలీసుశాఖ సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.