న్యూఢిల్లీ: జనాభా లెక్కల (2001, 2011) ప్రకారం గంజాయ్‌బద్ర, పట్టుచెన్నూరు, పాగులు చెన్నూరు గ్రామాలు ఏపీలోకే వస్తాయని విజయనగరం జిల్లా కలెక...
న్యూఢిల్లీ: జనాభా లెక్కల (2001, 2011) ప్రకారం గంజాయ్‌బద్ర, పట్టుచెన్నూరు, పాగులు చెన్నూరు గ్రామాలు ఏపీలోకే వస్తాయని విజయనగరం జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ అఫిడవిట్ సమర్పించారు. 3 గ్రామాలకు సంబంధించి 2006లో ఒడిశా దాఖలు చేసిన సూట్‌ను కోర్టు కొట్టివేసిన విషయాన్ని అఫిడవిట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాలను ఏపీ ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.