అనారోగ్యంతో మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ - Vandebharath

 


బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఛాతి నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో వైద్యుల సలహా మేరకు శుక్రవారం ఆమెను భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ప్రైవేట్‌ వార్డులో ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రగ్యా సింగ్ ఠాకూర్ గతేడాది డిసెంబర్‌ 18న కరోనా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇదిలాఉంటే.. ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న 2008 మాలెగావ్ పేలుడు కేసుపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు డిసెంబర్‌ 19న విచారణ జరుపాల్పి ఉండగా 18న ప్రగ్యా ఆసుపత్రిలో చేరారు.

Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]