Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అతివేగమే.. కారణమైంది.. Vandebharath

  చిత్తూరు(మదనపల్లె):  అప్పటివరకూ ఎంతో ఆనందంగా గడిపారు.. బంధువులందరితో కలిసి రాజస్తాన్‌ అజ్మీర్‌కు వెళ్తున్నామని సంతోషంతో ఒకరినొకరు ఆప్యాయంగ...

 


చిత్తూరు(మదనపల్లె): అప్పటివరకూ ఎంతో ఆనందంగా గడిపారు.. బంధువులందరితో కలిసి రాజస్తాన్‌ అజ్మీర్‌కు వెళ్తున్నామని సంతోషంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు.. ఈ యాత్ర వారికి ఒక మరుపురాని అనుభూతిగా ఉండేది.. ఇంతలోనే ఊహించని ప్రమాదం.. కళ్లుతెరిచేసే సరికి అంతా శూన్యం.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం గ్రామ సమీపంలో జరిగినరోడ్డు ప్రమాద ఘటన అందరనీ ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో సమీప గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అయితే.. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. అతివేగం వద్దు.. నిదానమే ముద్దు.. అంటూ ప్రతిచోటా చదువుతూనే ఉన్నాం.. కళ్లెదుటే కొన్ని ఘటనలనూ చూస్తున్నాం.. అయినా కొంతమంది కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇలాంటి ప్రమాదాల్లో తమప్రమేయం లేకుండానే కొంతమంది చనిపోతున్నారు. చిన్నారులూ మృత్యుఒడికిచేరుతున్నారు. ఎంతో అమూల్యమైన జీవితం.. ఇలాంటిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే ఆందోళనగా అనిపిస్తోంది.
తాజాగా కర్నూలు జిల్లా ప్రమాద ఘటనలోనూ అతివేగం కారణంగా 14మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన నలుగురు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఘటనా స్థలాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, జిల్లా ఎస్పీ ఫకీరప్పలు సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం పై ప్రాథమిక విచారణ చేయిస్తామని, మఅతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, ప్రాణాలతో బయటపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. డిఎస్‌పి నరసింహారెడ్డి, ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, రీజనల్‌ ట్రాన్స్పోర్ట్‌ అధికారి చందర్‌, డోన్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ శంకర్‌లు సందర్శించిన వారిలో ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌ రెడ్డిలు పరామర్శించారు.