Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తప్పించుకున్న ట్రంప్.. Vandebharath

  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగండం నుంచి తప్పించుకున్నాడు. అతడిపై పెట్టిన అభిశంసన నుంచి బయటపడ్డాడు. రెండో అభిశంసన విచారణలో ...

 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగండం నుంచి తప్పించుకున్నాడు. అతడిపై పెట్టిన అభిశంసన నుంచి బయటపడ్డాడు. రెండో అభిశంసన విచారణలో భాగంగా సెనేట్ లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా..అందులో ట్రంప్ గట్టెక్కాడు. ట్రంప్ పై అభిశంసన తీర్మానం నెగ్గేందుకు సెనేట్ లో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కానీ ఆ బలం లేకపోవడంతో ఆయనపై అభిశంసన అభియోగాలు వీడిపోయాయి. సెనేట్ లో మొత్తం 100 మంది సభ్యులు ఉండగా.. ట్రంప్ పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57 మంది వ్యతిరేకంగా 43మంది ఓటు వేశారు. దీంతో అభిశంసన నుంచి ట్రంప్ బయటపడ్డారు. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా ఏడుగురు రిపబ్లికన్లు ఓటేయడం గమనార్హం.

డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ.. ఆయన ఛరిష్మా ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అమెరికా సెనెట్ పై ఆయనకు ఉన్న పట్టు సడలలేదు. కిందటి నెల వాషింగ్టన్లో చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలు, అల్లర్లకు కారణం డొనాల్డ్ ట్రంపే అంటూ.. ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మాణం వీగిపోవడంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రిపబ్లికన్లు ఆయనకు అండగా నిలిచారు. ఈ తీర్మానం వీగిపోవడంతో వాషింగ్టన్ అల్లర్లలో ట్రంప్ నిర్దోషిగా బయటపడినట్లు అయ్యింది. దీనిపై ట్రంప్ సైతం స్పందించారు. తన ప్రజాబలం తగ్గలేదని రుజువైందని వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు, పార్లమెంటు భవనంపై దాడివంటి ఘటనలకు ట్రంప్ కారణం అంటూ.. యూస్ సెనెట్ అతడిపై రెండోసారి అభిశంసన తీర్మాణం ప్రవేశపెట్టింది. వరుసగా ఐదు రోజుల పాటు దీనిపై చర్చ జరిగింది. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానం 5743తో వీగిపోయింది. ట్రంప్ ను అభిశంసించడానికి డెమోక్రాట్లు చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. ట్రంప్ ను అభిశంసించాలంటూ.. ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 43 మంది వ్యతిరేకంగా 57మంది ఓటు వేశారు.

అమెరికా అధ్యక్ష చరిత్రలో ఇప్పటివరకు నాలుగుసార్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ట్రంప్ ఒక్కరే దాన్ని రెండుసార్లు ఎదుర్కొన్నారు. ఆయన్ను అభిశంసించడానికి డెమోక్రాట్లు వరుసగా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అభిశంసన వీగిపోయిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికీ తన బలం తగ్గలేదని మరోసారి రుజువైందని ట్రంప్ అన్నారు.ఒక నాయకుడిగా రెండు సార్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఎదురుదెబ్బలు తిన్న నేతలుగా డెమోక్రాట్లు చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.