Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రేవంత్ షాక్!.. Vandebharath

  తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగ...

 


తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపడితే మంచిదనే భావనతో ఉన్నారు. రాజకీయంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా చాలా వేగంగా అడుగులు వేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇస్తే మంచిదని భావనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో నేతను ఎంపిక చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేతలు రెడీ అయ్యారని సమాచారం.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బాగుంటుందనే భావన కాంగ్రెస్ కీలక నేతలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే... షర్మిల పార్టీ పెట్టాలనే ఆలోచన చేసిన తర్వాత నల్గొండ జిల్లా మీద ఎక్కువగా దృష్టి సారించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద కూడా ఎక్కువగా దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంచి బలం ఉంది. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ మారే ఆలోచన విరమించుకునే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఎలా అడుగులు పడతాయి అనేది తెలియదు. కానీ త్వరలోనే దీనిపై కచ్చితంగా ప్రకటన చేసే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు.