Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బీజేపీకి సున్నా- Vandebharath

చంఢీగడ్‌:   పంజాబ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఏడింటిలో విజయం సాధించగా ఒ...



చంఢీగడ్‌: పంజాబ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఏడింటిలో విజయం సాధించగా ఒక కార్పొరేషన్‌ ఫలితం తేలలేదు. తాజాగా గురువారం ఆ ఫలితం కూడా తేలింది. ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌లో చేరింది. మొహలీలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది కార్పొరేషన్‌ను సొంతం చేసుకుంది.

మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 7 స్థానాలు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మిగిలిన ఒక స్థానంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ నిలిచింది. అది కూడా కాంగ్రెస్‌ ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చేదు అనుభవం ఎదురైంది. అధికార పక్షానికి గట్టి పోటీ కూడా ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. శిరోమణి అకాలీ దళ్‌(ఎస్‌ఏడీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్నిచోట్ల ఆ పార్టీలు తమ ఉనికిని చాటుకున్నాయి.

మొహలీ కార్పొరేషన్‌లో 37 వార్డులను కాంగ్రెస్‌ సొంతం చేసుకోగా మిగిలిన 13 స్థానాలు స్వతంత్రులు భర్తీ చేశారు. ఇక మరో కార్పొరేషన్‌ మోగాలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈ కార్పొరేషన్‌ కూడా అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనుంది. దీనితో కలిపి జరిగిన మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్‌ వశమయ్యాయి.