Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Vandebharath

  హైదరాబాద్ :   దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకట...


 


హైదరాబాద్ : దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.88.14, డీజిల్ రూ.78.38కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.రూ.94.64, డీజిల్ రూ.85.32 గా ఉంది. అలాగే, బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.91.09, డీజిల్ రూ.83.09, జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.94.81, డీజిల్ ధర రూ.86.89, పాట్నాలో లీటరు పెట్రోలు రూ.90.86, డీజిల్ రూ.83.87 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.94.25కి, లీటరు డీజిల్ ధర రూ.87.59కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.91.65కి చేరింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి రూ.85.50కి పెరిగింది.