Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఉత్తరాఖండ్: ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు - Vandebharath

  డెహ్రాడూన్‌: ఉత్తరఖాండ్‌లోని ధౌలిగంగ నదిలో హిమానీ నదాలు సృష్టించిన జలప్రలయం నుంచి ఇద్దరు బతికి బయటపడ్డారు. దీంతో గత ఆరు రోజులుగా రెస్క్యూ ...

 

డెహ్రాడూన్‌: ఉత్తరఖాండ్‌లోని ధౌలిగంగ నదిలో హిమానీ నదాలు సృష్టించిన జలప్రలయం నుంచి ఇద్దరు బతికి బయటపడ్డారు. దీంతో గత ఆరు రోజులుగా రెస్క్యూ సిబ్బంది పడుతున్న కష్టానికి కొంతమేర ఫలితం దక్కింది. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇద్దరిని ప్రాణాలతో రక్షించామని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్‌ స్వాతి భదోరియా తెలిపారు. మరో 204 మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. తపోవన్‌ ప్రాజెక్టు సొరంగం వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

వరదల వల్ల మృతిచెందినవారి కోసం తమ బృందాలు గాలిస్తూనే ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్‌ కమాండెంట్‌ పీకే తివారీ అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని, ధౌలిగంగ నదిలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను గాలిస్తున్నాయని చెప్పారు. అన్ని ఏజెన్సీలు 24 గంటల పాటు సహయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని వెల్లడించారు.

గత ఆదివారం ధౌలిగంగ నది వరదల్లో చిక్కుకుని పలువురు గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో గత ఆరు రోజులుగా చమోలీ జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తపోవన్‌ ప్రాజెక్టు సొరంగంలోని భారీగా బురద పేరుకుపోవడంతోపాటు నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నది. ఈనేపథ్యంలో సొరంగంలో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది తమ వ్యూహాన్ని మార్చారు.

సొరంగ ముఖద్వారం నుంచి లోపలిదాకా పేరుకుపోయిన బురద, మట్టి, శిథిలాలను తొలగించడానికి బదులు.. గట్టిపడుతున్న ఆ బురద, మట్టి గుండా డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. లోపల ఉన్నవారికి ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సొరంగంలో 120 మీటర్ల మేర బురదను వారు తొలగించారు. బాధితులు 180 మీటర్ల దూరంలో ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగి ఇప్పటికే ఐదు రోజులు కావడంతో లోపలున్నవారికి ఆక్సిజన్‌ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.