న్యూఢిల్లీ: ఇండియా చెస్ క్వీన్, తెలుగమ్మాయి కోనేరు హంపి, హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, యంగ్ షూటర్ మనూ బాకర్.. బీబీసీ 'ఇండియ...
న్యూఢిల్లీ: ఇండియా చెస్ క్వీన్, తెలుగమ్మాయి కోనేరు హంపి, హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, యంగ్ షూటర్ మనూ బాకర్.. బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేస్‌లో నిలిచారు. అలాగే, వినేశ్ పోగట్, ద్యుతీ చంద్‌ను.. 40 మందితో కూడిన జ్యూరీ ప్యానెల్ మరోసారి నామినేట్ చేసింది. పబ్లిక్ ఓటింగ్ ద్వారా విన్నర్‌ను డిసైడ్ చేస్తారు. బీబీసీలోని ఆరు లాంగ్వేజ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫేవరెట్ ప్లేయర్‌కు ఓటు వేయొచ్చు. ఈ నెల 24 వరకు ఓటింగ్ లైన్స్ అందుబాటులో ఉంటాయి. మార్చి 8న (ఇంటర్నేషనల్ వుమెన్స్ డే) విన్నర్‌ను ప్రకటిస్తారు. ఈసారి కొత్తగా 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును బీబీసీ ప్రవేశపెట్టింది. అయితే వరుసగా రెండో ఏడాది కూడా అవార్డుల రేస్‌లో మహిళా క్రికెటర్ లేకపోవడం గమనార్హం.