Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ICC - 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' - Vandebharath

  దుబాయ్‌: టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మరో ఘనత సాధించాడు. ఐసీసీ ఫస్ట్‌ టైమ్‌ ప్రవేశ పెట్టిన 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌'...


 

దుబాయ్‌: టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మరో ఘనత సాధించాడు. ఐసీసీ ఫస్ట్‌ టైమ్‌ ప్రవేశ పెట్టిన 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' అవార్డును సొంతం చేసుకున్నాడు. జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సూపర్‌ పెర్ఫామెన్స్‌ చూపెట్టిన పంత్‌.. సిడ్నీలో 97, బ్రిస్బేన్‌ 89 రన్స్‌ చేయడం కలిసొచ్చింది. ఈ రెండు పెర్ఫామెన్స్‌లకు మెచ్చిన ఐసీసీ అవార్డును కట్టబెట్టింది. రేస్‌లో ఉన్న జో రూట్‌, పాల్‌ స్టిర్లింగ్‌ కంటే పంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐసీసీ ఫస్ట్‌ అవార్డు తనకు రావడంపై పంత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఏ స్పోర్ట్స్‌ పర్సన్‌కైనా టీమ్‌ను గెలిపించడం అల్టిమేట్‌ రివార్డు. ఇలాంటి అవార్డులు మరింత స్ఫూర్తి చెందడానికి దోహదపడతాయి. ప్రతీసారి నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ అవార్డును టీమ్‌ మెంబర్స్‌ అందరికీ డెడికేట్‌ చేస్తున్నా. నాకు ఓటేసిన ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌' అని పంత్‌ వ్యాఖ్యానించాడు. వుమెన్స్‌ కేటగిరీలో షాబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (సౌతాఫ్రికా)కు ఈ అవార్డు దక్కింది. పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 7 వికెట్లు తీసిన ఇస్మాయిల్‌.. సెకండ్‌ టీ20లో ఐదు వికెట్లు పడగొట్టింది.

ఉత్తరాఖండ్​ రెస్క్యూకు సాయం.

ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం రిషబ్‌ పంత్‌ తనవంతు సాయం అందించాడు. తన మ్యాచ్‌ ఫీజును డొనేట్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. తనలాగ మరింత మంది కంట్రిబ్యూట్‌ చేయాలని కోరాడు. 'ఉత్తరాఖండ్‌ జలవిలయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. రెస్క్యూ ఎఫర్ట్‌ కోసం నా మ్యాచ్‌ ఫీజును డొనేట్‌ చేస్తున్నా. చాలా మంది హెల్ప్‌ చేయాలని కోరుతున్నా' అని పంత్‌ పేర్కొన్నాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ డిస్ట్రిక్ట్‌లోని రూర్కీలో పంత్‌
జన్మించాడు.