Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భారత్ కు నీరవ్.. Vandebharath

  - అప్పగించేందుకు బ్రిటన్‌ కోర్టు అంగీకారం - ఆయన సంస్థలన్నీ డమ్మీనే - వ్యాపారాల్లో పారదర్శకత లేదు - అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆధారాలున్నా...

 


- అప్పగించేందుకు బ్రిటన్‌ కోర్టు అంగీకారం
- ఆయన సంస్థలన్నీ డమ్మీనే
- వ్యాపారాల్లో పారదర్శకత లేదు
- అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆధారాలున్నారు
లండన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ. 14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించవచ్చునని బ్రిటన్‌ కోర్టు తీర్పునిచ్చింది. కరోనా కారణంగా ఆయన మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నాడని, భారత్‌లో జైళ్లు బాగోవని చెప్పిన కుంటిసాకులను కోర్టు తోసిపుచ్చింది. నీరవ్‌ మోడీ భారత్‌కు అప్పగించడం మానవ హక్కులకు అనుగుణంగానే ఉందని విశ్వసిస్తున్నట్టు జిల్లా జడ్జి శామ్యూల్‌ గూజీ అన్నారు. కాగా, ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నీరవ్‌కు అవకాశాన్ని కల్పించారు. వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరిగిన ఈ విచారణకు నైరుతి లండన్‌లోని వాండ్‌వర్త్‌ జైలు నుంచి నీరవ్‌...వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. భారత్‌కు తరలించినట్టయితే తనకు న్యాయం జరగదు అనేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ..భారత ప్రభుత్వానికి నీరవ్‌ను అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. భారత్‌లో ఆయనపై దాఖలైన కేసు చాలా బలంగా ఉందని జడ్జి పేర్కొన్నారు. లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ క్లియర్‌ చేయడంలో నీరవ్‌ మోడీతో పాటు బ్యాంకు అధికారులకు సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. అయితే తిరిగి వాటిని చెల్లిస్తానని హామీనిచ్చారని, కానీ ఆయన సంస్థలన్నీ డమ్మీలని తేలిపోవడంతో సీబీఐ దర్యాప్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.