Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఇంగ్లండ్ ఔట్.. టాప్ ప్లేస్‌కు ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లో ఓడితే ఆసీస్‌కు చాన్స్! - Vandebharath

  అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై డే/నైట్‌ టెస్ట్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టేబుల్లో టాప్ ప్లేస్‌క...

 


అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై డే/నైట్‌ టెస్ట్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టేబుల్లో టాప్ ప్లేస్‌కు చేరింది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. 71 విన్నింగ్ పర్సంటేజ్‌, 490 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోపక్క 10 వికెట్ల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.

అయితే, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోకూడదు. లాస్ట్ టెస్ట్‌లో గెలవకపోయినా కనీసం డ్రా చేసుకున్నా భారత్ లార్డ్స్‌లో జరిగే మెగా ఫైనల్లో బరిలోకి దిగుతుంది.

అలా కాకుండా ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే.. 69.2 పీసీటీతో డబ్ల్యూటీసి టేబుల్లో ప్రస్తుతం థర్డ్ ఫ్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఇలా జరిగే అవకాశాలు తక్కువ. కోహ్లీసేన నాలుగో టెస్టును డ్రా చేసుకోగలదు.

డే/నైట్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (5/32), అశ్విన్‌ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్‌ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది.

రోహిత్‌ శర్మ (25 నాటౌట్‌ 3 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (15 నాటౌట్‌ 1 ఫోర్, 1 సిక్స్‌) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్‌ పటేల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.