Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మళ్లీ గ్రే లిస్ట్‌లోనే పాక్‌ - Vandebharath

  న్యూఢిల్లీ : పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మూడు కీలక విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున.. ఆ దేశం గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతుందని ఫై...

 

న్యూఢిల్లీ : పాక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మూడు కీలక విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున.. ఆ దేశం గ్రే లిస్ట్‌లోనే కొనసాగుతుందని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​(ఎఫ్ఏటీఎఫ్​) స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు మనీలాండరింగ్ వ్యవహారాన్ని తనిఖీ చేయడంలో పాక్​​ వైపు తీవ్రమైన లోపాలు ఉన్నాయని విమర్శించింది. టెర్రర్ ఫైనాన్సింగ్‌ను తనిఖీ చేయడంలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యవస్థ లేదని చెప్పింది. సమావేశం అనంతరం ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడు మార్కస్‌ ప్లీయర్‌ మాట్లాడుతూ పాక్‌కు ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిందని, ఇస్లామాబాద్‌ వారి సమస్యలను వీలైనంత తర్వగా పరిష్కరించుకోవాలన్నారు.

ఈ రోజు వరకు పాక్‌ అన్ని కార్యాచరణ ప్రణాళిక అంశాల్లో పురోగతి సాధించింది. ఈ రోజు వరకు 27 అంశాల్లో 24 ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, వారి అనుచరులకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి ఆ దేశ​ న్యాయస్థానాలు తగిన శిక్షలు విధించాలని సూచించారు. ఉగ్రవాదులపై ఆర్థిక ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కీలకమైన మూడు మూడు కీలక విధులను పూర్తి చేసిన అనంతరం.. జూన్‌లో జరిగే ప్లీనరీ సమావేశంలో పాక్ ​పరిస్థితిపై సమీక్షించి, తదుపరి ప్లీనరిలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.