Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేరళలో బీజేపీ ప్రభుత్వమే నా లక్ష్యం: మెట్రో శ్రీధరన్ - Vandebharath

  Metro Sridharan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా.. ఎలాంటి పథకాలు తెచ్చినా వ్యతిరేకించడం ఫ్యాషన్‌ అయిపోయి...

 


Metro Sridharan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా.. ఎలాంటి పథకాలు తెచ్చినా వ్యతిరేకించడం ఫ్యాషన్‌ అయిపోయిందని మెట్రో శ్రీధరన్ విమర్శించారు. ప్రభుత్వంపై దేశంలో ఎక్కడా అసహనం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలను సమర్థించారు. ఈ మేరకు కేరళ వాసి అయిన 88ఏళ్ల మెట్రో శ్రీధరన్ శుక్రవారం పీటీఐతో మాట్లాడారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన భారత మెట్రో మ్యాన్ శ్రీధరన్.. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. కేరళ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

విదేశీ వ్యవస్థలు, సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయడాన్ని వాక్ స్వాతంత్ర్యంగా పిలవకూడదని మెట్రో శ్రీధరన్ పేర్కొన్నారు. ఇది వ్యవస్థపై యుద్ధంతో సమానమని.. ఇలాంటి దుర్వినియోగాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చాలా ఏళ్లుగా తనకు తెలుసున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పని చేసిన కాలంలో తాను అనేక ప్రాజెక్టుల కోసం పని చేశానన్నారు. మోదీ చాలా నిజాయితీపరుడని, అవినీతికి పాల్పడబోరని, దూరదృష్టిగలవారని చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా చాలా చిన్నాచితక పార్టీలు ఉన్నాయని, ఇవన్నీ కలిసి బీజేపీపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి రాజకీయాలు దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో చేరితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయవచ్చని అందుకే బీజేపీని ఎంచుకున్నట్లు శ్రీధరన్ వెల్లడించారు. కాగా మెట్రో శ్రీధరన్ ఆదివారం బీజేపీలో చేరబోతున్నారు.