డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడి ఆదివారం జలప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించగా.. మరో ...
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడి ఆదివారం జలప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించగా.. మరో 170 మంది గల్లంతయ్యారు. వరద ఉధృతికి ఒక జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకటి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆదివారం రాత్రి 8.00 గంటల సమయానికి అలకనందలో కూడా ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
అలకనంద, ధౌలీగంగ, రిషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గంగానదికి ఉపనదులైన రిషిగంగ ధౌలీగంగలో కలిసి అనంతరం ఈ రెండూ అలకనందలో కలుస్తాయి. ధౌలీగంగలో సాధారణ నీటి మట్టానికి మించి మూడు మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తోంది.
తపోవన్ సమీపంలోని విష్ణుగడ్ 480 మెగావాట్‌ల జలవిద్యుత్తు కేంద్రంలోకి నీరు చొచ్చుకెళ్లింది. 'దీంతో అందులో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు' అని ఉత్తరాఖండ్ ప్రకఅతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన సొరంగం పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా వరద నీరు ప్రవేశించడంతో కార్మికులు నీటిలో చిక్కుకున్నారు.