India Vs England 1st Test Day 4: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తాజాగా నాలుగో రోజు ఆట ప్రారంభం అయింది. ...
India Vs England 1st Test Day 4: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తాజాగా నాలుగో రోజు ఆట ప్రారంభం అయింది. తొలి రెండు రోజులు చెపాక్ పిచ్‌పై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేయగా.. మూడో రోజు టీమిండియా తడబడింది. ఓ దశలో 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను.. వికెట్ కీపర్ రిషబ్ పంత్(91), పుజారా(73) ఆదుకున్నారు. ప్రస్తుతం క్రీజులో సుందర్(33*), అశ్విన్(8*) ఉండగా.. టీమిండియా మూడో రోజు ఆట ముగిసేసరికి 257/6తో నిలిచింది. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు.. బెస్ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, టీమిండియా ఫాలో ఆన్ గండం దాటాలంటే మరో 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ జట్టు ఆశలన్నీ కూడా క్రీజులో ఉన్న అశ్విన్, సుందర్‌పైనే ఉన్నాయి.