Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కౌంటర్ ఇచ్చిన వసీం జాఫర్.. Vandebharath

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్లో భారత జట్టు ఎలా రాణ...


ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్లో భారత జట్టు ఎలా రాణిస్తుంది అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లోనే అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నప్పటికీ ఘోర పరాజయాన్ని చవిచూసింది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవలే భారత జట్టు పై వచ్చిన విమర్శలు అన్నింటికీ కూడా తమ ఆటతోనే సమాధానం చెప్పింది భారత జట్టు.


ఇటీవలే చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన భారత 300కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ జట్టు పై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు అటు విమర్శకుల నోళ్లు కూడా ముయించింది అన్న విషయం తెలిసిందే. జట్టులోని ప్రతి ఆటగాడు కూడా గెలుపులో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత జట్టు సమిష్టి కృషితో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో అటు ఇంగ్లాండ్ క్రికెటర్లు పిచ్ సరిగ్గా లేదని అంటూ పలు రకాల విమర్శలు కూడా చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

ఇటీవల భారత్ సాధించిన అద్భుత విజయం పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ భారత జట్టును కవ్వించేలా ఒక పోస్టు పెట్టగా ఇక దీనిపై స్పందించిన భారత మాజీ ఆటగాడు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. భారత్కు కంగ్రాట్స్.. ఇంగ్లాండ్-బి జట్టుపై గెలిచినందుకు అంటూ పీటర్సన్ ఒక పోస్ట్ పెట్టగా దీనిపై స్పందించిన వసీం జాఫర్.. పీటర్సన్ ను టోల్ చేయకండి.. ఎందుకంటే సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు లేకుండా ఇంగ్లాండ్ జట్టు పూర్తి సామర్థ్యం కలిగిన జట్టుగా ఎలా అవుతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు వసీం జాఫర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన పీటర్సన్ గతంలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.