Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రేపే ఐపీఎల్ వేలం.. Vandebharath

  చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్‌) మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభమవుతుంద...

 


చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్‌) మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయర్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి61 మంది ప్లేయర్స్‌ను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఏ టీమ్‌కు ఎంత మంది ప్లేయర్స్ తీసుకునే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్‌

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 6

ఎంత డబ్బు ఉంది: రూ.19.9 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8

ఎంత డబ్బు ఉంది: రూ.13.04 కోట్లు

పంజాబ్ కింగ్స్

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9

ఎంత డబ్బు ఉంది: రూ.53.2 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8

ఎంత డబ్బు ఉంది: రూ.10.75 కోట్లు

ముంబై ఇండియన్స్

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 7

ఎంత డబ్బు ఉంది: రూ.15.35 కోట్లు

రాజస్థాన్ రాయల్స్‌

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9

ఎంత డబ్బు ఉంది: రూ.15.35 కోట్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 14

ఎంత డబ్బు ఉంది: రూ.35.4 కోట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌

వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 3

ఎంత డబ్బు ఉంది: రూ.10.75 కోట్లు