వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ .. తన టీంలో మహిళలకు.. అందునా భారతసంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్న...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. తన టీంలో మహిళలకు.. అందునా భారతసంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్ తాజాగా మరో భారత సంతతి మహిళను అత్యున్నత పదవికి నామినేట్ చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఇండో అమెరికన్ భవ్యా లాల్ నియమితులయ్యారు. ఆమెతో పాటు ఫిలిప్ థామ్సన్ వైట్ హౌస్ అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. ఇక భవ్యా లాల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార మార్పిడి బృందంలో నాసా తరఫున సభ్యురాలిగా పనిచేశారు. నాసాలో అధికారుల నియామకంలో కీలకంగా వ్యవహరించారు.
నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు. ఇక నాసా ఏర్పడిన 63 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ మహిళా అధిపతిగా ఎన్నికవ్వడం.. అందులోనూ భారత సంతతి మహిళను ఈ అత్యున్న పదవి వరించడం గౌరవంగా భావిస్తున్నారు.