కామారెడ్డి : కారు బోల్తా పడి భార్యాభర్తలు మృతిచెందిన ఘటన కామారెడ్డిలోని మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ...
కామారెడ్డి : కారు బోల్తా పడి భార్యాభర్తలు మృతిచెందిన ఘటన కామారెడ్డిలోని మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఎల్పుగొండ వాసులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు కారులో వెళ్తున్నారు.. శివుల రేణుక (25), ప్రవీణ్ (25) దంపతులు ముందు కూర్చున్నారు.. శివుల లక్ష్మి (45) (ప్రవీణ్ తల్లి), బాలవ్వ(65), ఏల్పుగొండకు చెందిన కొంపల్లి నర్సింలు, భార్య లక్ష్మి(రేణుక తల్లిదండ్రులు), కూతురు అఖిల (రేణుక చెల్లెలు) కారులో వెనకాల ఉన్నారు.. మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి సమీపానికి చేరుకోగానే కారు అదుపు తప్పి రోడ్డుకు కుడివైపునకు దూసుకుపోయింది. పొదల్లోకి వెళ్లి బోల్తా పడింది. కారు నడుపుతున్న ప్రవీణ్ ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య రేణుకలు ఈ ఘటనలో చనిపోయారు.శివుల లక్ష్మి, బాలవ్వ అఖిలలకు గాయాలయ్యాయి.. క్షతగాత్రులను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శివుల లక్ష్మి, బాలవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.. ప్రవీణ్, రేణుకల వివాహం ఐదేళ్ల క్రితమే జరిగింది. పిల్లలు పుట్టకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ లో వైద్యం నిమిత్తం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలానికి మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి చేరుకొని విచారణ జరిపారు.