Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్‌ డైమండ్‌ మృతి - Vandebharath

  ఫ్లోరిడా:  ప్రముఖ హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్‌ డైమండ్‌(44) మృతి చెందారు. కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న డస్టిన్‌ ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో సోమవ...


 ఫ్లోరిడా: ప్రముఖ హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్‌ డైమండ్‌(44) మృతి చెందారు. కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న డస్టిన్‌ ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో సోమవారం కన్నుముశారు. ‘సెవ్డ్‌ బై ది బెల్’‌ సిరీయల్‌తో బాల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్‌ కొంతకాలంగా కణ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన తండ్రి మార్క్‌ డైమండ్‌ తెలిపాడు. స్టేజ్‌ 4 కణ క్యాన్సర్‌కు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడు‌ నిన్న మరణించినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు. కాగా 1989 నుంచి 1992 మధ్యకాలంలో వచ్చిన ‘సెవ్డ్‌ బై ది బెల్‌’ సరీయల్‌లో డస్టీన్‌ బాల నటుడిగా అందరిని మెప్పించాడు. ఇందులో డస్టిన్‌ తన స్కెచ్‌ ప్రతిభతో మంచి గుర్తింపు పొందాడు. అప్పట్లో ప్రముఖ ఛానల్‌ ఎన్‌బీసీలో ప్రతి రోజు శనివారం ఉదయం ప్రసారమయ్యే ఈ సిరీయల్‌ అత్యంత ప్రేక్షక ఆదరణ పొందింది.