Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఉత్తరాఖండ్ ఇంకా తేరుకోలేదు - Vandebharath

  డెహ్రాడూన్: వరద బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ ఇంకా తేరుకోలేదు. ధౌలి గంగ ఉప్పెనలా ముంచెత్తిన దుర్ఘటనలో ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. 171 ...


 

డెహ్రాడూన్: వరద బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ ఇంకా తేరుకోలేదు. ధౌలి గంగ ఉప్పెనలా ముంచెత్తిన దుర్ఘటనలో ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. 171 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. వరద ప్రభావంలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటివరకు 27 మందికి జావాన్లు కాపాడారు. చమోలీ జిల్లా జోషిమఠ్ లో ఎటుచూసినా బురద, మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. గల్లంతైన వారిలో జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలు ఉన్నారు. తమ వారి కోసం బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తపోవన్ జలవిద్యుత్ కేంద్రంలోని సొరంగంలో 34 మంది చిక్కుకున్నారు. వారిని వెలికితీసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగానికి ఒక మార్గమే ఉన్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో భారీ యంత్రాలతో మట్టిని తొలగిస్తున్నారు. ఉత్తరాఖండ్ సిఎం రావత్ జోషిమఠ్ లోనే ఉండి సహాయ పనులను పర్యవేక్షిస్తున్నారు. చమోలిలో హిమానీనద విపత్తు కారణంగా ప్రభావితమైన ప్రాంతాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వైమానిక సర్వే నిర్వహిస్తున్నారు.