న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన పాఠశాల విద్యార్థులు అరుదైన ఘనతను సాధించారు. భూమికి ముప్పుగా పరిణమించే అవకాశాలున్న ఆస్ట్రాయిడ్స్ (గ్రహ శకలా...
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన పాఠశాల విద్యార్థులు అరుదైన ఘనతను సాధించారు. భూమికి ముప్పుగా పరిణమించే అవకాశాలున్న ఆస్ట్రాయిడ్స్ (గ్రహ శకలాలను) గుర్తించారు. నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ సైన్స్ కార్యక్రమంలో 18 ఆస్టరాయిడ్స్‌ను విద్యార్థులు కనిపెట్టినట్లు ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వెల్లడించింది. అంగారక, గురు గ్రహాల మధ్య కోట్లాది గ్రహ శకలాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇవి గమన మార్గాన్ని మార్చుకుని భూమివైపునకు దూసుకువస్తున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించేందుకు నాసా సిటిజన్ సైన్స్ ప్రాజెక్టు పేరిట ఏటా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు 18 కొత్త గ్రహ శకలాలను కనుగొన్నారని స్టెమ్ అండ్ స్పేస్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు మిలా మిత్రా తెలిపారు.