Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు.. కాల్పులు.. 18మంది మృతి - Vandebharath

  మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం రంగూన్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు నిరసలు...

 

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం రంగూన్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు నిరసలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, సైనికులు నిరసన కారులను హెచ్చరించారు.

ఆందోళన మరి ఉధృతమవడంతో సైనికులు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్, గ్రైనైడ్లతో కాల్పులు నిర్వహించారు. ఈ ఆందోళనలో సైనికులు, ప్రజల మధ్య ఘర్షన నెలకొంది. దీంతో అక్కడికక్కడే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది.


పోలీసులు, సైనికులు ఉక్కుపాదం మోపినా నిరసన నుంచి వెనక్కి తగ్గేది లేదని మయన్మార్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. నవంబర్‌లో ఎన్నికల ఫలితాలను సైన్యం గౌరవించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అంగ్ సాంగ్ సూకీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. మరోసారి సూకీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికల్లో గెలవడంతో ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ సైన్యం తిరగబడింది.

మరో ఏడాదిపాటు సైన్యం ఆధీనంలో తమ పాలన కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు మరోసారి సూకీతోపాటు పలువురు నాయకులను నిర్బంధించారు. దీంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. సైనికుల వ్యవహారంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.