Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భారీగా పతనమైన రూపాయి విలువ.. 18 నెలల్లో ఇదే అత్యధికం.. కుదేలైన షేర్ మార్కెట్లు - Vandebharath

  దేశీయ కరెన్సీ రూపాయి విలువ భీకర స్థాయిలో పడిపోయింది. యూఎస్ డాలర్‌ 73.47 తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా వంద పైసలకు పైగా ద...

 


దేశీయ కరెన్సీ రూపాయి విలువ భీకర స్థాయిలో పడిపోయింది. యూఎస్ డాలర్‌ 73.47 తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా వంద పైసలకు పైగా దిగజారింది. గత ఏడాదిన్నర కాలంలో రూపాయి విలువ.. తొలిసారి ఇంత దారుణంగా పతనం కావడం ఇదే మొదటిసారి. అయితే.. శుక్రవారం భారత రూపాయితో పాటు ఈక్విటీ మార్కెట్ కూడా దారుణంగా పతనమైంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉండటంతో.. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ షేర్ మార్కెట్లపై పడింది. అయితే.. చివరిసారిగా.. 2019 ఆగస్టు 5న రూపాయి విలువ ఇంతకంటే ఎక్కువగా క్షీణించింది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దెబ్బతిన్న మదుపర్ల సెంటిమెంట్‌.. రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు. అంతేకాకుండా పెరుగుతున్న చమురు ధరలు కూడా పతనమవ్వడానికి కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం నుంచే రూపాయి విలువ తీవ్ర ఒత్తిడిలో ఉన్నది. సమయం గడుస్తున్నకొద్దీ ఇది పెరుగుతూపోయింది. ఇక ఈ వారం మొత్తంలో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 82 పైసలు తగ్గినట్లు ఫారెక్స్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
ఇక డాలర్ మారకంతో రూపాయి 104 పైసలు క్షీణించి 73.47 వద్ద ముగిసింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తడం, ఓవర్సీస్ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలంగా ఉండటంతో రూపాయి పతనమైంది. కాగా… గడిచిన 19 నెలల కాలంలో రూపాయికి ఇది దారుణమైన పతనం.

దీంతోపాటు సెన్సెక్స్ 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది. డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో రూపాయి కూడా పతనమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రభావంతో స్టాక్ మార్కెట్ బలహీన పడవచ్చన్న సూచనలు అందుతున్నాయి.