Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం? Vandebharath

  సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్ (ఓవర్ ది టాప్) ఫామ్స్‌పై నియంత్రణ కోసం కేంద్ర చర్యలకు ఉపక్రమించింది. వాటి నియంత్రణలకు పక్కా మార్గదర్శకాలను...

 


సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్ (ఓవర్ ది టాప్) ఫామ్స్‌పై నియంత్రణ కోసం కేంద్ర చర్యలకు ఉపక్రమించింది. వాటి నియంత్రణలకు పక్కా మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కూడా చేసింది. నిజానికి ఈ అంశం చాలా కాలంగా చర్చల్లో నానుతోంది. సినిమాలకు సెన్సార్ బోర్డు వుంది కానీ అవే సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేసే ఎలాంటి నియంత్రణ లేదు. సినిమాలలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సీన్లను యాడ్ చేసి.. లేదా అసలు సెన్సార్ బోర్డు ముందుకే పంపని క్లిప్పిగులను యాడ్ చేసి మరీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై విడుదల చేయడం రివాజుగా మారింది.

అటు సోషల్ మీడియాకైతే పట్టపగ్గాల్లేవనే చెప్పాలి. తమకు నచ్చిన ఏదైనా పోస్టును.. ఎక్కువగా భావోద్వేగాలను రెచ్చగొట్టే హేట్ స్పీచులను పోస్టు చేయడం తప్పించుకు తిరగడం అలవాటై పోయింది చాలా మంది. ఈవిధంగా చేసిన ఓ ప్రబుద్ధుడు కొన్ని నెలల తర్వాత దుబాయ్ నుంచి రాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం అరెస్టు చేశారు. తాజాగా కేంద్ర సోషల్ మీడియాపైనా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పైనా నియంత్రణ కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేపథ్యం, దాంట్లో పోస్టయిన కొన్ని వివాదాస్పద అంశాలు ఎలా వైరల్‌గా మారి ఎవరికి ఇబ్బందికరంగా పరిణమించాయో చూద్దాం.