సమాజ సేవకుడికి దక్కిన అరుదైన గౌరవం ప్రొఫెసర్ యస్వంత్ రావ్ కేల్కర్ యువ సేవా పురస్కార్ 2020: నా వల్లే సమాజం మారుతుందా..? నా ఒక్కడి...
సమాజ సేవకుడికి దక్కిన అరుదైన గౌరవం
ప్రొఫెసర్ యస్వంత్ రావ్ కేల్కర్ యువ సేవా పురస్కార్ 2020:
నా వల్లే సమాజం మారుతుందా..? నా ఒక్కడి సహాయం వల్లే పేదల జీవితాలు మారిపోతాయా..? అనే వాళ్ళకి
ఒక సామాన్యుడు ఒక చిరు ఉద్యోగి ఈ సమాజానికి ఏం చెయ్యగలడో ధన్వి శ్రీనివాస్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ......
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న టైం అంతా
మనం బ్రతకడం మన కుటుంబాన్ని బ్రతికించడం కోసమే సరిపోతుంది. ఇక సేవా కార్యక్రమాలకు టైం ఎక్కడిది ? అటువంటి పరిస్థితుల్లో మనకి సేవ చెయ్యాలనే తపన ఉండాలి గాని మన జీవన శైలి కొంత మార్చుకుని
మన కుటుంబానికి న్యాయం చేస్తూ పది మందికి ఎలా ఉపయోగపడొచ్చు అని నా మిత్రుడు ధన్వి.శ్రీనివాస్ జీవనశైలిని దగ్గర నుంచి గమనించిన నాకు కొంతమేర అర్థమైంది.
ఉదయం నాలుగింటికి లేచి కొంత మంది మిత్రుల సహాయం తో స్వయంగా అల్పాహారం చేసి వాటిని పార్సిల్ చేసి వీధి వీధి తిరిగి అభాగ్యులకు పంచి పెడుతూ అటు తర్వాత 60 కిలోమీటర్లు బైక్ మీద వెళ్లి ఉద్యోగం చేసి వస్తూ వస్తూ దారిలో గ్రామాలు సందర్శిస్తూ,ఆయా గ్రామాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను గమనించి తర్వాత రోజు వెళ్లి ఆ ఆలయాలకు పూజా సామగ్రిని ఉచితంగా అందిస్తారు.దీని కోసం అనేక స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటారు.తద్వారా ఆ గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం సృష్టించడం ద్వారా సనాతన భారతీయ సంస్కృతి మరుగున పడి ఆన్6అన్యమతాల ఆగడాలు అరికట్టడం ప్రధాన ప్రయోజనం.
SC, ST కాలనీల్లో ఎటువంటి పూజలకి నోచుకోని గ్రామదేవతల ఆలయాల్లో మరమ్మతులు
చేయించి ఆక్కడ నిత్యం పూజలు, భజనలు జరిగేట్లు చూడడం తమ ప్రధాన కర్తవ్యంగా భావిస్తాడు.
SC, ST కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించి
వాళ్లలో ఉన్న కొన్ని దూరాచారాలు రూపు మాపి,
వాల్లని దురలవాట్ల నుంచి దారి మళ్లించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటట్లు చెయ్యడం, తెలిసో తెలియక మతం మారిన సోదరులను స్వధర్మంలోకి తీసుకురావడంతో బాటు కాలనీల్లో కటిక పేదరికంతో ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న వారిని తన మిత్రుల సహాయంతో ఆదుకోవడం మిత్రులను సహాయ కార్యక్రమాల్లో సమీకరించి వారి తోడ్పాటు తో పేదలకు పలు సహాయ కార్యక్రమాలు చెయ్యడం వంటివి చెయ్యడం ధన్వి శ్రీనివాస్ నిత్య కార్యక్రమాలు. వీరి సేవలు ఏబీవీపీ వారు గుర్తించి సన్మానం చేయడం చాలా ఆత్మసంతృప్తిని కలిగించింది. -కరుణాకర్ సామాజిక కార్యకర్త