ఆరు నెలలుగా మూతపడిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆర్జిత సేలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆది,సోమవారాల్లో భక్తులు పోటెత్తారు. లాక...
ఆరు నెలలుగా మూతపడిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆర్జిత సేలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆది,సోమవారాల్లో భక్తులు పోటెత్తారు. లాకడౌన్ ఎత్తేసిన అనంతరం కేవలం స్వామివారి దర్శనాన్ని ప్రారంభించడంతో వారం, వారం భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. ఈ తరుణంలో సిబ్బంది, ఉద్యోగులు కూడా కరోనాబారిన పడ్డారు. పలుమార్లు ఆలయ దర్శనాన్ని నిలిపివేశారు. తాజాగా 50శాతం ఆర్జితసేవల నిర్వహణకు చర్యలు తీసుకున్నందున భక్తుల రద్దీ పెరగనుండడంతో ఆలయ వర్గాల్లో గుబులు పట్టుకుంది.
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తీసుకున్న 50శాతం ఆర్జితసేవల నిర్వహణకు భక్తులు సహకరించాలని ఈవో వెంకటేశ్ పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో నిర్వహించే వాహన పూజకు నిత్యం 30 టికెట్లు, ఆదివారం 60 టికెట్లు ఇవ్వనున్నారు. ఒక్కో టికెట్‌కు ఇరువురికి మాత్రమే ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులకు మాత్రమే గదులు కేటాయించనున్నారు. గది ఖాళీ చేసిన అనంతరం పూర్తి శానిటేషన్ చేసి ఇతరులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని ఆలయాధికారులు తెలిపారు.