బాబ్రీ కట్టడం విధ్వంసం కేసులో "చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇది చాలా సంతోషకరమైన రోజు’’ అంటూ ఎల్.కె.అడ్వాణీ స్పందించారు. ‘‘అయోధ్యలో డి...
బాబ్రీ కట్టడం విధ్వంసం కేసులో "చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇది చాలా సంతోషకరమైన రోజు’’ అంటూ ఎల్.కె.అడ్వాణీ స్పందించారు. ‘‘అయోధ్యలో డిసెంబర్ 6న అదంతా హఠాత్తుగా జరిగిందని, అందులో ఏ కుట్రా లేదని ఈ తీర్పు నిరూపిస్తోంది’’ అని తన వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. తీర్పు రావడం ఆలస్యం అయినప్పటికీ న్యాయమే గెలుస్తుందని ఇది నిరూపించిందని అన్నారు.
తీర్పుపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ "సత్యమేవ జయతే, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతానికి బాధితులైన పూజ్య సాధువులు, నేతలు, వీహెచ్‌పీ పదాధికారులు, సామాజిక కార్యకర్తలు అబద్ధపు కేసుల్లో చిక్కుకుని అపఖ్యాతి పాలయ్యారు. ఈ కుట్రకు వారు ప్రజలను క్షమాపణలు కోరాలి" అని ట్వీట్ చేశారు.