Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రపంచ పర్యావరణ దినోత్సవం - world envoronment day in telugu - vandebharath

ప్రకృతికీ, మానవుడికీ అవినాభావ సంబంధం ఉంది. ఆ ప్రకృతిలో ముఖ్యంగా ఐదింటిని మనిషి తప్పనిసరిగా రక్షించుకోవాలి. అవి లేకపోతే మానవాళి మనుగడే ...


ప్రకృతికీ, మానవుడికీ అవినాభావ సంబంధం ఉంది. ఆ ప్రకృతిలో ముఖ్యంగా ఐదింటిని మనిషి తప్పనిసరిగా రక్షించుకోవాలి. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు. అవేమిటి?

1.భూసంపద – భారతీయులు భూమిని తల్లిగా భావిస్తారు. కొలుస్తారు. ‘మాతా భూమీ, పుత్రోహం పృథివ్యా’. భూమికి, మనకు మధ్య తల్లీబిడ్డల సంబంధం ఉంది. కాబట్టి భూమికి నష్టం చేసే పనులు ఏవీ చేయకూడదు. భూమాతను విషతుల్యం చేయకూడదు. అమృతమయం చేయాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా మట్టిని అమృతమయం చేయాలి.

2.జలసంపద – జలం కూడా తల్లే. కర్మాగారాలవల్ల మరియు మానవ జీవనశైలిలోని వికృతుల వల్ల నీరు కూడా కలుషితమవుతోంది. ప్రతి నీటిని ‘గంగామాత’గా భావించి జలసంరక్షణకు పూనుకోవాలి. ప్రతి నీటి బొట్టును వృధా చేయకుండా ప్రయత్నించాలి.

3. వనసంపద – అడవి మనకు దేవత. అందుకనే వనమహోత్సవాలు చేస్తాం. వనమంటే వనస్పతి. అంటే ఆరోగ్యసంపద. విస్తారమైన అడవుల వల్ల వర్షాలు, తద్వారా పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అడవుల్ని రక్షించుకోవాలి. పూర్వం దేవుని వనం, పాఠశాల వనం, గ్రామవనం ఉండేవి. వాటిని మళ్ళీ ఏర్పరచుకోవాలి.

4. జీవసంపద – ‘సర్వభూతస్యామాత్మానం’ – అన్ని జీవుల్లో దేవుడున్నాడని నమ్మే విశేష సంప్రదాయం మనది. మానవాళి మనుగడకు పశువులు, పక్షులు మొదలైనవి కూడా ఎంతో దోహదపడుతున్నాయి. సృష్టిలో జీవ వైవిధ్యం వల్లనే సమతుల్యం కాపాడుతండబడుతుంది. కనుక అన్ని జీవుల్ని కూడా రక్షించాలి. గోవు మనకు తల్లి. ఆ గోవును రక్షించుకోవాలి.

5. జనసంపద – సంతానం కూడా భగవంతుడు ఇచ్చిన సంపద, వరమే. కాబట్టి దానిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన బిడ్డల్ని మనమే చంపుకునే దురాచారానికి స్వస్తి పలకాలి. ఆడశిశువుల్ని తల్లి కడుపులోనే కడతేర్చే నీచానికి ఒడిగట్టకూడదు. ప్రాణంపోసే శక్తి లేనప్పుడు, ప్రాణంతీసే హక్కు ఎక్కడది? 
దేశం అంటే ఇదే. ఈ ఐదు సంపదల్ని కాపాడుకుంటే దేశం దానికదే సురక్షితం అవుతుంది. దేశం బాగుంటే మనం బాగుంటాం. ఈ పని ప్రతి గ్రామంలో జరగాలి. గ్రామం కన్నతల్లి వంటిది. గుడి గుండెకాయ వంటిది. కన్నతల్లి వంటి గ్రామాన్ని కడుపులో పెట్టి చూసుకుందాం.
  (ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని)
  -సాకి