చైనా పై ప్రతీకారం తీర్చుకోవాలి ఏబీవీపీ హబ్సిగూడ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్ల వెంకటేష్ చారి డిమాండ్ చేశారు హై...
చైనా పై ప్రతీకారం తీర్చుకోవాలి ఏబీవీపీ హబ్సిగూడ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్ల వెంకటేష్ చారి డిమాండ్ చేశారు హైదరాబాద్: లడఖ్‌లో చైనా సైనికులతో జరిగిన గొడవలో భారతీయ కల్నల్ ఒకరు మృతిచెందారు. ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అని తెలిసింది. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘర్షణలో.. భారత సైన్యంలోని ముగ్గురు జవాన్లు చనిపోయారు. దీంతో గాల్వన్ వ్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు మరింత జఠిలం అయ్యాయి. బుల్లెట్ ఫైరింగ్ లేకుండా జరిగిన ఘర్షణల్లోనే ఇరు దేశాలకు చెందిన సైనికులు మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు ఆ ఘర్షణల్లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కల్నల్ సురేష్.. లడఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ దళానికి కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
సోమవారం రాత్రి గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అమ్మా, దేశం కోసం వీర జవాన్ ను తయారు చేసి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర పుత్రుణ్ణి కన్న మీకు పాదాభి వందనం వీర జవాన్ బిక్కు మల్ల సంతోష్ కు జోహార్ జోహార్..