Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అమెరికాలో నల్ల జాతి వివక్షపై స్పందించన మహేష్ బాబు, రకుల్ - vandebharath

జాతి వివక్ష అనేది తరతరాలుగా కొనసాగుతూ వస్తూనే ఉంది. నాడు బ్రిటీష్ వారు భారతీయులను నల్లజాతివారని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఇప్పట...

జాతి వివక్ష అనేది తరతరాలుగా కొనసాగుతూ వస్తూనే ఉంది. నాడు బ్రిటీష్ వారు భారతీయులను నల్లజాతివారని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ప్రపంచంలో ఏదో మూల ఎవరో ఒకరు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి వివక్ష మూలాన ఓ మరణం సంభవించింది. దీనికి నిరసనగా ప్రపంచం మొత్తం గొంతెత్తుతోంది. ఈ క్రమంలో ఇండియా నుంచి బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ పోరాటంలో పాలు పంచుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

అమెరికాలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో లాకప్‌లోనే మరణించాడు. దీంతో ఆగ్రహా జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. మంగళ వారం ఈ ఘటన జరగడంతో #BLACKOUTTUESDAY అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

జాతి వివక్షతకు వ్యతిరేకంగా బాలీవుడ్ మొత్తం కదిలింది. ఈ మేరకు నల్ల బాక్సులను పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి కామెంట్స్ చేయకుండా కేవలం నలుపురంగును తమ పోస్ట్‌లో పేర్కొంటూ ఆ హ్యాష్ టాగ్‌ను జత చేస్తున్నారు. కరణ్ జోహర్, విక్కీ కౌశల్, ఇషాన్ కట్టర్, సారా అలీఖాన్ వంటి తారాగణం అంతా ఈ పోరాటంలో పాల్గొన్నారు.


రకుల్ ప్రీత్ ఈ ఘటనపై సీరియస్ అయింది. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ కొటేషన్‌ను పోస్ట్ చేసింది. ఒక్క మనిషి హక్కుకు హాని కలిగినా.. అందరి హక్కులకు ముప్పు వాటిల్లినట్టే అనే కొటేషన్‌ను షేర్ చేస్తూ.. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోంది..మానవ మనుగడ కోసం చేసే కనీసం పోరాటం అది..ఎప్పుడైతే రక్షించవలసిన లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తూ ఉంటుందో.. అప్పుడు మనమంతా నిశ్శబ్దంగా ఉండలేమ'ని తెలిపింది.

సామాజిక సమస్యలపై స్పందించే మహేష్ బాబు.. ఈ ఘటనపైనా రియాక్ట్ అయ్యాడు. #BLACKOUTTUESDAY హ్యాష్ ట్యాగ్‌తో నలుపురంగు బాక్సుతో ఓ ఫోటోను షేర్ చేసి నిరసన తెలిపాడు. నమ్రతా శిరోద్కర్ కూడా మహేష్ బాటలోనే నడిచింది. ఇదిలా ఉండగా కంగనా రౌనత్ మాత్రం భారతదేశం లో ఉన్న గిరిజనులు, వనవాసుల కోసం గొంతెత్తాలని సినిమా వాళ్ళకు సూచించింది.