Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పథకం ప్రకారమే అంకిత్ శర్మ హత్య - vandebharath

ఫి బ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లలో అతి కిరాతకంగా హత్యకు గురైన నిఘా విభాగం (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో కీలక విషయం బయటపడింది...


ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లలో అతి కిరాతకంగా హత్యకు గురైన నిఘా విభాగం (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో కీలక విషయం బయటపడింది. కొంతమంది వ్యక్తుల గ్రూపు ముందస్తుగా చేసుకున్న ప్రణాళిక ప్రకారమే అంకిత్‌శర్మను హత్య చేసినట్టు దిల్లీ క్రైమ్ పోలీస్‌, దిల్లీ మెట్రోపాలిటిన్‌ న్యాయస్థానానికి ఛార్జ్‌షీట్‌ సమర్పించారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ తాహీర్‌ హుస్సేన్‌ నేతృత్వంలోనే ఆ మూక ఇంతటి దారుణకాండకు పాల్పడినట్టు అందులో పేర్కొన్నారు. అతడిని చంపిన తర్వాత దగ్గర్లో ఉన్న మురుగుకాల్వలో పడేశారని, తర్వాత రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఛార్జీషీటులో ఉంచారు.

ఈ తతంగాన్ని మొత్తం ఒక స్థానిక వ్యక్తి తన భవంతి పైనుంచి చరవాణితో చిత్రీకరించాడని పోలీసులు తమ ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. అదే ఇపుడు కీలకసాక్ష్యంగా మారునుందని తెలిపారు. అంకిత్‌శర్మ శరీరంపై మొత్తం 51 లోతైన కత్తిపోట్లు ఉన్నట్టుగా పోస్టుమార్టంలో గుర్తించినట్టు నివేదించారు. ఈ కేసు విచారణను జూన్‌ 16 చేపట్టనున్నట్టు న్యాయమూర్తి రిచా పారిహర్‌ తెలిపారు.