Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అమెరికాలో ప్రెసిడెంట్ అండ్ టీం దాక్కొడానికి అమెరికాలో ఉన్న బంకర్ల గురించి మీకు తెలుసా? vandebharath

  అ ధ్యక్ష భవనం కిందే రహస్య స్థావరం ట్రంప్‌ అంతే.. కింద పడ్డా పైచేయి నాదే అంటారు.. ప్రపంచమంతా ఓ కోణంలో చూసే దానిని ట్రంప్‌ మాత్రమే వేరే కోణం...

 ధ్యక్ష భవనం కిందే రహస్య స్థావరం

అబ్బే దాక్కోలేదు.. బంకర్‌ పరిశీలించా..!ట్రంప్‌ అంతే.. కింద పడ్డా పైచేయి నాదే అంటారు.. ప్రపంచమంతా ఓ కోణంలో చూసే దానిని ట్రంప్‌ మాత్రమే వేరే కోణంలో చూస్తారు. తాజాగా ఇలాంటి మాటల విన్యాసాన్ని మరోసారి ప్రదర్శించారు. ఆఫ్రో-అమెరికన్లపై దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం శ్వేతసౌధం ఎదుట భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది రహస్య బంకర్‌లోకి తరలించారు. ఈ విషయంలో వెలుగులోకి రావడంతో ట్రంప్‌ తన ధైర్యంపై మచ్చగా దానిని భావించారు. తాజాగా దానికి సంబంధించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండుమూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. బయట ఏమేం రాశారో కూడా చదివాను. అక్కడకు వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అయినా, నా సమీపంలోకి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు’’ అని ఫాక్స్‌ న్యూస్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌(పీఈఓసీ)గా పిలిచే ఈ బంకర్‌లోకి శుక్రవారం రాత్రి అధ్యక్షుడు వెళ్లినట్లు తొలుత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఆయన అక్కడ గంటసేపు ఉన్నట్లు పేర్కొంది. అసలు అమెరికా అధ్యక్షుడిని రక్షించడానికి సైన్యం, రహస్య ఏజెన్సీలు పలు ఏర్పాట్లు చేశాయి. దాడికి ఆస్కారం ఉన్నట్లు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించేస్తారు. ముఖ్యంగా కోల్డ్‌వార్‌ సమయంలో అధ్యక్షుడిని రక్షించేందుకు ఓ చిన్నసైజు విమాన వాహక నౌకను కూడా సిద్ధం చేశారు. కానీ, తర్వాత  ఆ ప్రణాళికను వదిలేశారు. ఇప్పటికీ భారీ దాడులను నుంచి అమెరికా అధ్యక్షుడి రక్షణకు చాలా ఏర్పాట్లు ఉన్నాయి. వీటిపై అమెరికాలోని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. 

అసలు ఈ పీఈఓసీ బంకర్‌ ఏమిటీ..?

రెండో ప్రపంచ యుద్ధంలో శ్వేత సౌధంపై జరిగే దాడుల నుంచి అమెరికా అధ్యక్షుడు నాటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ రక్షించేందుకు ఈ బంకర్‌ను నిర్మించారు. ఇది శ్వేత సౌధంలో ఎక్కడ ఉందనే విషయం టాప్‌ సీక్రెట్‌. చాలా మంది ఈస్ట్‌వింగ్‌ సమీపంలో ఉందని చెబుతుంటారు. వైట్‌హౌస్‌ మిలటరీ ఆఫీస్‌ సిబ్బంది దీని నిర్వహణ చూస్తుంటారు. వీరి ఆధీనంలోనే క్యాంప్‌డేవిడ్‌లోని అధ్యక్షుడి క్యాంప్‌ కార్యాలయం, ప్రెసిడెంట్‌కు సంబంధించిన ఎయిర్‌లిఫ్ట్‌ గ్రూప్‌, శ్వేత సౌధం వైద్య విభాగం కూడా ఉంటాయి. ఈ బంకర్‌లో కీలక కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయి.

ఇటీవల కాలంలో ఎవరైనా వినియోగించారా..?

అబ్బే దాక్కోలేదు.. బంకర్‌ పరిశీలించా..!

2001 సెప్టెంబర్‌ 11 ట్విన్‌ టవర్స్‌పై దాడులు జరిగిన తర్వాత  నాటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ దీనిలో తలదాచుకొన్నారు. అదే రోజు రాత్రి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ను ఫ్లోరిడా నుంచి ఇక్కడకు తరలించారు. ఆయన సతీమణ లారా బుష్‌ను ఇక్కడే ఉంచి సంరక్షించారు. ఈ విషయాన్ని లారా బుష్‌ ‘స్పోకెన్‌ ఫ్రం ది హార్ట్‌’ అనే పుస్తకంలో వెల్లడించారు. అక్కడ కమాండ్‌ సెంటర్‌, ఫోన్లు, టీవీలతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఒక విమానం శ్వేత సౌధంపై కూలినా తట్టుకొనేట్లు ఈ బంకర్‌లో మార్పులు చేశారు. అప్పటి నుంచి దీనిని ఎవరూ వినియోగించినట్లు వార్తలు రాలేదు. ఇటీవల మాత్రం దానిని ట్రంప్‌ తనిఖీ చేసినట్లు అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. 

శ్వేతసౌధంలో అనేక మార్గాలు..

అబ్బే దాక్కోలేదు.. బంకర్‌ పరిశీలించా..!

శ్వేత సౌధంలోనే ఉత్తరాన ఉన్న గడ్డిమైదానం (నార్ లాన్‌) భూగర్భంలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇది పీఈఓసీ కంటే చాలా పెద్దది. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత దీనిని నిర్మించారు. దీనిలో అధ్యక్షుడు, ఆయన కుటుంబీకులు, శ్వేత సౌధ సిబ్బంది నివశించేలా ఏర్పాట్లు చేశారు. ఈ భూగర్భ భవనం జీవాయుధ, రేడియో ధార్మిక దాడులను తట్టుకొంటుందని గతంలో వాషింగ్టన్‌ పోస్టు తన కథనంలో వెల్లడించింది. అధ్యక్షుడిని ఇక్కడి పూర్తిగా తరలించడానికి అవసరమైన సొరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి.  

రావెన్‌ రాక్‌..

అబ్బే దాక్కోలేదు.. బంకర్‌ పరిశీలించా..!

అమెరికా అధ్యక్షుడి విడిది అయిన క్యాంప్‌ డేవిడ్‌ సమీపంలో సైన్యాన్ని ఉంచడానికి వీలుగా దీనిని నిర్మించారు. 1953లో దీనిని ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 1400 వందల మంది సురక్షితంగా.. సౌకర్యవంతంగా నివశించవచ్చు. ఒక కొండను తొలిచి దీనిని నిర్మించడంతో అత్యంత సురక్షితమైందిగా చెబుతారు. దీనిలో దాదాపు లక్ష చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ ఉందని చెబుతుంటారు. అత్యవసర సమయంలో సైనిక  కార్యకలాపాలను నిర్వహించవచ్చు. 

మౌంట్‌ వెదర్‌..

అబ్బే దాక్కోలేదు.. బంకర్‌ పరిశీలించా..!

అత్యవసర సమయాల్లో అమెరికా అధ్యక్షుడు, సుప్రీం కోర్టు, మంత్రి వర్గ సభ్యులు, సీనియర్‌ కాంగ్రెస్‌ సభ్యులను రక్షించుకొనేందుకు వర్జీనియా రాష్ట్రంలో దీనిని నిర్మించారు. రావెన్‌రాక్‌ ప్రారంభించిన ఏడాది తర్వాత ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇక్కడ ఏకంగా ఒక చిన్న పట్టణాన్నే నిర్మించారు. దీనిలో వాటర్‌ రిజర్వాయిర్‌, వేల మంది అధికారులు, వారి కుటుంబాలు నిశించేంత సౌకర్యంగా ఉంటుంది. కొండపై బాహ్య ప్రపంచానికి కనిపించే భాగాన్ని ‘ఏరియా-ఎ’ అని , భూగర్భంలో ఉన్న భాగాన్ని ‘ఏరియా-బి’ అని పిలుస్తారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత దీనిని మరింత అభివృద్ధి చేశారు