మరో కోయంబేడుగా గుంటూరు మార్కెట్ - vandebharath

 
గుంటూరు నగరం ఏటుకూరురోడ్డులోని కొల్లిశారద హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో కరోనా కలకలం చెలరేగింది. ఇక్కడ ఇప్పటి వరకు 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా మంగళవారం ప్రకటించిన 23 కేసుల్లో 18 మంది ఈ మార్కెట్‌కు చెందిన వారే.
దీంతో గంటూరు నగరంతో పాటు జిల్లా మొత్తం ఉలిక్కి పడింది.  కొల్లి శారద మార్కెట్‌ రాష్ట్రానికి మరో కోయంబేడుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.   అమ్మకానికి కూరగాయలు తెచ్చే రైతులు, వాహన డ్రైవర్లు, కూలీలు, రిటైలర్‌ వ్యాపారులు, కొనుగోలుదారులు.. ఇలా నిత్యం ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, వేలాది మందికి ప్రత్యక్ష సంబంధం ఉంటోంది.
నాలుగురోజుల క్రితం ఈ మార్కెట్‌లో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో మార్కెట్‌ను మూసివేసి, హమాలీలను, వ్యాపారులను క్వారంటైన్‌కు తరలించారు. వీరిలోనే తాజా కేసులు వెలుగు చూశాయి, ఈ మార్కెట్‌కు ప్రతిరోజు కనీసం వెయ్యిమంది వరకు రిటైల్‌ వ్యాపారులు వస్తుంటారు.
జిల్లాలోని10 మండలాలు, 100 గ్రామాలకు ఇక్కడ నుండి కూరగాయలు సరఫరా అవుతున్నాయి. ఆ గ్రామాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుండి మార్కెట్‌కు వచ్చే డ్రైవర్ల ద్వారా ఇక్కడ వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు.
Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]