స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్రచారాన్ని నిర్వహించారు తారక్. తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాల...
స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్రచారాన్ని నిర్వహించారు తారక్. తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే తారక్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వినపడుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
’జూనియర్ ఎన్టీఆర్‌లాంటి వ్యక్తులు కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అనే వాదన ఉంది’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘అది డేడికేషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. అదీగాక మీరు ఫుల్ టైమ్ పొలిటిక్స్ అంటున్నారు.
తనకు సినిమా యాక్టర్‌గా చాలా భవిష్యత్తు ఉంది. మరి వాడిష్టం. ప్రొఫెషన్ వదులుకుని రమ్మనముగా. ఇప్పుడు నేనున్నాను ఎం.ఎల్.ఎగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్నగారు కూడా సీఎంగా ఉన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబట్టి వారి వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది’’ అన్నారు.