శ్రీ శైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేస...
శ్రీశైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేసుల్లో 27 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.12 కోట్లు అవినీతి జరిగిందని డీఎస్పీ వెంకట్రావు తెలిపారు.
ఇప్పటివరకు రూ.83.40 లక్షల నగదు, ఒక కారును రికవరీ చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీలు సృష్టించి షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ ఛేంజ్ ద్వారా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో కొందరిని పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.