Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తెలంగాణ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలి - ABVP

ప్రస్తుతం కరోనా సమయంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి సరికాదు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వ...

ప్రస్తుతం కరోనా సమయంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి సరికాదు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్ల వెంకటేష్ చారి డిమాండ్ చేశారు. పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు ఉన్నప్పుడు పరీక్షలు నిర్వహించకుండా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో వందల సంఖ్యలో కరోనా పేషెంట్లు ఉంటే ఇప్పుడు నిర్వహిస్తాను అని చెప్పడం ప్రభుత్వానికి సరికాదని ఆయన అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కార్పొరేట్ స్కూళ్లలో అధిక మొత్తంలో ఈరోజు పల్లెలకు,  జిల్లాలకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నారని దానివల్ల ఏ ఒక్క విద్యార్థికి రక్షణ ఉండదని ఆయన అన్నారు. తక్షణమే పరీక్షలు ఆపాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను మొదటగా కరోనా పరీక్షలు నిర్వహించి హాస్పిటల్ కు పంపిస్తారా లేదంటే తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి  పరీక్షలు రాస్తున్న 534000 కి పైగా తెలంగాణలో పదవ తరగతి  పరీక్షలు రాస్తున్న విద్యార్థుల లోకి పంపిస్తారా చెప్పాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంకటేష్ చారి డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఈరోజు డాక్టర్లను పోలీసులను కాపాడలేని ఈ ప్రభుత్వం విద్యార్థులను ఎలా కాపాడుతుందని వెంకటేష్ చారి ప్రశ్నించాడు. పరీక్ష కేంద్రాలు పెంచుతానని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు పరీక్ష కేంద్రాలను పెంచకుండా అదే పాఠశాలలో వరండాలలో పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి కి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఎలా పరీక్షలు నిర్వహిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు ప్రజలను రక్షించే  డాక్టర్లు,పోలీసులకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఈ రోజు పరీక్ష లు నిర్వహిస్తుంటే 534000 విద్యార్థులకు కనీసం ఒకరికి ఇంట్లో నుంచి ఒకరు వచ్చినా 10 68,000 వేలమంది బయటకు వస్తే  టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది చెప్పాలని వెంకటేష్ చారి డిమాండ్ చేశారు. కార్పొరేట్ పాఠశాలలో నివసించే విద్యార్థులకు ఏ విధంగా రక్షణ ఉంటుందని ఆయన అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్  చేస్తుంది. ఒకవైపు టీచర్ లు పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం అని చెపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏ ఒక్క విద్యార్థికి జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ దే పూర్తి నైతిక బాధ్యత వహించాలని వెంకటేష్ చారి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇంతవరకు నిధులు కేటాయించలేదని, నిధులు కేటాయించకుండా పరీక్షలు నిర్వహిస్తే ఏబీవీపీ ఊరుకో దని వెంకటేష్ చారి అన్నారు. గ్రేటర్ హైదరాబాదులో మూడు వేలకు పైగా పరీక్ష కేంద్రాలు ఉండటం వలన కనీస జాగ్రత్తలు కూడా ఇంతవరకు చేపట్టలేదని వెంకటేష్ చారి అన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పరీక్షలు నిర్వహిస్తే ఏబీవీపీ పరీక్ష కేంద్రాల ముందు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని వెంకటేష్ చారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.