Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అయోమయంలో ఏపీ ప్రభుత్వం - vandebharath

  లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ఉపశమనం కలిగిస్తూ  అంతరాష్ట్ర రాకపోకలపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా...

 
లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ఉపశమనం కలిగిస్తూ  అంతరాష్ట్ర రాకపోకలపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నది.  అంతర్రాష్ట్ర రాకపోకలపై తమ విధానాన్ని ప్రకటిస్తూ మిగిలిన రాష్ట్రాలన్నీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా ఏపీ ప్రభుత్వం సందిగ్థతను విడనాడలేదు.
పొరుగున ఉన్న తెలంగాణ సైతం కట్టడి ప్రాంతాల్లో మినహా రాకపోకలపై ఆంక్షలు సడలిస్తూ ఆదేశాలిచ్చింది. అన్ని రాష్ట్రాలు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకొని ఉత్తర్వులు జారీచేస్తే ఏపీలో మాత్రం అర్ధరాత్రి వరకూ విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇవ్వకపోవడం గమనార్హం.
కాగా,  అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఏపీలోకి రావాలనుకొనే వారు కచ్చితంగా ‘స్పందన’ పోర్టల్‌ ద్వారా ఈ-పాస్‌ తీసుకోవాలని అందులో స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు.
వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు 7 రోజులు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. పాజిటివ్‌ వచ్చినవారు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాలని, నెగెటివ్‌ వచ్చినవారు మరో 7రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో డీజీపీ స్పష్టం చేశారు.
మరోవంక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ నుంచి వచ్చే రైలు ప్రయాణికులందరికీ టెస్టులు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అవసరాన్ని బట్టి క్వారంటైన్‌కి పంపిస్తామని ప్రకటించింది. మెడికల్ టెస్ట్ రైల్వే స్టేషన్‌లో కానీ, జిల్లా రిసెప్షన్ సెంటర్‌లో కానీ నిర్వహిస్తారు. ఇక విదేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా ప్రభుత్వ లేదా పెయిడ్ క్వారంటైన్‌కి వెళ్లాల్సిందే.