Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మరణాలలో తెలంగాణ వేగం, కొంపముంచిన కె సీ ఆర్ - vandebharath

కరోనా టెస్ట్ లు, కాంటాక్ట్ వ్యక్తులను కేసీఆర్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు తెలంగాణలో కరోనా వైరస్ అదుపు తప్పుతున్న...


కరోనా టెస్ట్ లు, కాంటాక్ట్ వ్యక్తులను కేసీఆర్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు తెలంగాణలో కరోనా వైరస్ అదుపు తప్పుతున్నది. టెస్టులు తక్కువగా జరుపుతున్నా, పలు సాకులతో మరణాల సంఖ్యను తగ్గించి చూపుతున్నా వైరస్ కేసులలో, మరణాలలో తెలంగాణ వేగంగా ముందుకు పోతున్నది.
దేశంలోనే మరణాల సగటు సంఖ్య తెలంగాణలో అత్యధికంగా  ఉండగా, కరోనా కేసులలో మూడో స్థానంలో ఉంది. గతంలో నాలుగో స్థానంలో ఉండగా, ఇప్పుడు మహారాష్ట్ర, ఢిల్లీల తర్వాత తెలంగాణలోనే ఎక్కువ కేసులు ఉండడం గమనార్హం.
దేశంలో 1.86 లక్షల కేసులకు 5,000 మందికి పైగా, అంటే 2.83 శాతం మంది మృతి చెందితే, తెలంగాణలో 3.1 శాతం మంది మృతి చెందారు. మరణాల సంఖ్యను  యధాతధంగా చూపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులే స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా గత నెల రోజులుగా, లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటి నుండి తెలంగాణలో కేసులు పెరుగుతూ ఉండడం గమనార్హం. నెల రోజుల క్రితం ప్రతి 100 టెస్ట్ లలో 5.1 శాతం మందికి వైరస్ సోకితే, ఇప్పుడు 8.22 శాతంకు చేరుకొంది. అంటే 3.1 శాతం పెరిగింది.
మహారాష్ట్రలో 14.5 శాతం మందికి, ఢిల్లీలో 8.97 శాతం మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదట్లోనే కరోనా పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించడం పట్ల శ్రద్ద వహించినట్లయితే ఇప్పడీ పరిస్థితి ఎదురయ్యెడిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణలో ఆదివారం కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 82 మంది కరోనా బారినపడి చనిపోయారు. 
చాల రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా కేసులు పెరుగుతూ వస్తుండగా, ఇప్పుడు జిల్లాలో కూడా పెరుగుతున్నాయి. వలస కార్మికుల రాక, జనం రద్దీ పెరగటం, జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకల కారణంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది.