Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తెలంగాణ నంబర్ వన్ ఎట్లా కెసీఅర్ - బండి సంజయ్ - vandebharath

  ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్ వన్ సీఎం కేసీఆర్ ప్రకటించుకోవడాన్ని కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవ...

 
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్ వన్ సీఎం కేసీఆర్ ప్రకటించుకోవడాన్ని కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇది ఎలా నిర్ధారించారని సంజయ్ ప్రశ్నించారు.
ఈ  విషయం భారత ఆహార సంస్థ (ఎఫ్​సీఐ) జీఎం ఎలా చెబుతారని సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఎఫ్ సీఐ జీఎంకు ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.108 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న పంజాబ్ ముందుంటదా? లేక 66 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిన తెలంగాణ ముందుంటదా? అని సంజయ్ నిలదీశారు.
రైస్ మిల్లర్లకే ఇంకా ధాన్యం చేరలేదని, మరి ఎఫ్ సీఐ ఎలా కొనుగోలు చేసిందో సీఎం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఇలా ఉండగా,  సాగు నీటి ప్రాజెక్టుల్లో కమీషన్లు కొట్టేసినట్లే, పంటల పేరుతోనూ దోచుకునేందుకే సీఎం కేసీఆర్  నియంత్రిత సాగు  విధానాన్ని తీసుకొచ్చారని  ఆరోపించారు. అది నిర్బంధ సాగే అవుతుందని అంటూ బిజెపి వ్యతిరేకిస్తోందని స్ఫష్టం చేశారు.
ఎరువులు, విత్తనాల కంపెనీలతో సీఎం ఒప్పందాలు చేసుకొని ఉంటారని, అందుకే పంటల సాగు విధానమంటూ కొత్త దుకాణం తెరిచారని విమర్శించారు. రైతుబంధును ఎగ్గొట్టేందుకే కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రుణమాఫీ పేరుతో రైతులను మోసగించిన కేసీఆర్, ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ పూర్తిగా ఎక్కడ అమలైందో చెప్పాలని ప్రశ్నించారు.
చెప్పిన పంటలే వేయాలంటున్న ప్రభుత్వం రైతులు నష్టపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. చెప్పిన పంట వేస్తే ఎంత మద్దతు ధర ఇస్తారో ముందే ప్రకటించాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. పంటల మార్పిడికి బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే అది శాస్త్రీయంగా ఉండాలని స్పష్టం చేశారు.