Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తాహిర్ అహ్మద్ అనే ఉగ్రవాది హతం - vandebharath

  కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తాహిర...

 
కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తాహిర్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి.
సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌. ఐదు గంటల పాటు సాగింది. ఈ ఏడాది జనవరి నుంచి తాహిర్ కోసం వేట మొదలుపెట్టామని జమ్మూకశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇటీవలే హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.